![]() |
![]() |
.webp)
ఈ ప్రపంచంలో లేని రోగం అంటూ ఏదీ లేదు..ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని మందులు , అన్ని ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో మైగ్రేన్ తలనొప్పి ఒక రకమైన తలనొప్పి..అది వస్తే తట్టుకోవడం చాల కష్టం. మరి నటి మాధవి కూడా అదే మైగ్రేన్ తో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేని ఆమె చివరికి సింగర్, మ్యూజిక్ కంపోజర్ ఐన ఆర్పీ పట్నాయక్ ని సలహా అడిగేసరికి ఆయన ఒక వ్యక్తిని రిఫర్ చేశారట..దాంతో ఆమె ఆయన దగ్గర వైద్యాన్ని తీసుకుంటూ కనిపించింది.
ఆ వీడియోని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. " మర్మ కళ -1వ పార్ట్ ట్రీట్మెంట్, ఇతను 20 సంవత్సరాల క్రితం దలైలామా నుండి శిక్షణ తీసుకున్న వ్యక్తి..ప్రస్తుతం నేను ఇతని దగ్గర నా మైగ్రేన్ కు , స్ట్రెస్ కి, కండరాల బలహీనతకు చికిత్స తీసుకున్నాను.
.webp)
ఇతని దగ్గర ఈ థెరపీని మంచి రీలీఫ్ పొందండి అంటూ సలహా ఇచ్చిన ఆర్పీ పట్నాయక్ కి చాలా ధన్యవాదాలు" అని చెప్పింది మాధవి. ఇక మాధవి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో లవర్స్ కి సంబందించిన ఒక కామెంట్ కూడా పోస్ట్ చేసింది " ఈమధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు లవ్ లేదు అంటూ వేల కామెంట్స్ కనిపిస్తున్నాయి. అమ్మాయిలంతా ఎల్ లే అంటున్నారు.. రైట్ ఆల్ ఎల్ అంటే అందులో మీ అమ్మా మీ సోదరి కూడా ఉన్నారని అర్ధం..వాళ్ళు నీకు అమ్మ, అక్క, పిన్ని...బయటవాళ్ళకు లవర్స్ కదా ..సింపుల్ ఇదెలా మర్చిపోయారు మగమహారాజులూ...కామెంట్ ఐటెం రాజాలు ?" అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
![]() |
![]() |